Narsa Reddy Bhupathi Reddy : మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి

TRINETHRAM NEWS

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి .

Trinethram News : ఈరోజు చేవెళ్ల నియోజకవర్గం లోని చేవెళ్ల మున్సిపాలిటీ మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్, ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తో పాటు సమావేశంలో పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు జరిగే సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తుంది కావున ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ నాయకులు ఇంటింటి ప్రచారంలో పాల్గొనాలని తెలియపరిచారు.

చేవెళ్ల నియోజకవర్గం లోని ప్రధాన సమస్య రహదారులని వాటిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రహదారికి కావాల్సిన ల్యాండ్ ఆక్విజేషన్, గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్లు, కోర్టు సమస్యలను పరిష్కరించి రహదారి నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దోహదపడిందని గుర్తు చేశారు. చేవెళ్ల పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి ఈ ప్రభుత్వం అండదండలుగా నిలబడుతుందని ప్రజలకు వివరించాలని తెలియపరచడం జరిగింది.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ భీమ్ భరత్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు ఎంఎ ఫహీం, నరసింహ రెడ్డి, టిపిసిసి స్పోక్ పర్సన్ గౌరీ సతీష్, పొల్యూషన్ బోర్డ్ మెంబర్ సత్యనారాయణ రెడ్డి , పీసీసీ సభ్యులు సతీష్, చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి సమతా వెంకటరెడ్డి, చేవెళ్ల సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, చేవెళ్ల మండల ప్రెసిడెంట్ వీరేందర్ రెడ్డి, చేవెళ్ల మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, మండల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పెంటయ్య గౌడ్, కుత్బుల్లాపూర్ సీనియర్ నాయకులు జలీల్ ఖాన్, రాధాకృష్ణ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Narsa Reddy Bhupathi Reddy participated in the preparatory meeting

You cannot copy content of this page

Scroll to Top