డిండి (గుండ్ల పల్లి)మార్చి 07, త్రినేత్రం న్యూస్. డిండి మండల విద్యాధికారిగా పగిడిపాటి నరసింహ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నరసింహ ప్రస్తుతం మండల పరిధిలోని కామేపల్లి జెడ్ పి హెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. గతంలో విద్యాధికారి గా పనిచేసిన గోప్యా నాయక్ నుండి నరసింహ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నరసింహ కు పలువురు ఉపాధ్యాయులుఅభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంలో విద్యాధికారి గా వీడ్కోలు పొందుతున్న గోప్యా నాయక్ ను ఉపాధ్యాయులు ఘనంగాసన్మానించారు.
ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గీతాంజలి రెడ్డి, సదానంద రావు, రామారావు, ఆర్ పి ఆర్ పి స్కూల్ ప్రిన్సిపాల్ శిరీష, ఉపాధ్యాయులు తిరుపతయ్య, పవన్, వెంకటయ్య, సైదులు, సరిత, బాల్య తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


