నాగుపాము – నాగబాబు ఇద్దరు ఒక్కటే.. అన్నం పెట్టిన గీత ఆర్ట్స్ నే కాటేసాడా?

TRINETHRAM NEWS

Nagupamu – Nagababu are one and the same

Trinethram News : ఎట్టకేలకు ఈనెల 13న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఘట్టం ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు , 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు ముగిసాయి..

ప్రస్తుతం అందరి దృష్టి ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ పైనే నిలిచింది.. ఈ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు అనే విషయం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా ఎన్నికల్లో అల్లు అర్జున్ ఒకవైపు.. మిగిలిన మెగా కుటుంబం అంతా ఒకవైపు నిలిచాయి..

ఇక తనకు అత్యంత ఆప్తుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగారు.. అంతేకాదు మిత్రుడి కోసం నంద్యాలకు వచ్చి సతీసమేతంగా ప్రచారం కూడా చేశారు..

అల్లు అర్జున్ పై కుట్ర బయటపెట్టిన నాగబాబు..
మరోవైపు జనసేన పార్టీ తరపున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా స్వయానా తన మేనమామ పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ.. ఆయన కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లలేదు.. దీంతో ఈ విషయం కాస్త మెగా కుటుంబంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది..

అల్లు అర్జున్ వైఖరిని తప్పుపడుతూ పోలింగ్ ముగిసిన రోజున జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఒక ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులకు పూర్తిగా ఆగ్రహాన్ని తెప్పించింది.. ఇక దానిపై చెలరేగిన దుమారం ఇప్పటికీ తగ్గలేదని చెప్పాలి.. అంతేకాదు ఈ ట్వీట్ నాగబాబును విమర్శలకు కేంద్రబిందువుగా మార్చింది ముఖ్యంగా నాగబాబు వేసిన ట్వీట్ కి అల్లు అర్జున్ అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఆఖరికి నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేసుకునేలా చేశారు.

అయినా సరే అల్లు అర్జున్ అభిమానులు, జనసేన మాజీ నాయకులు నాగబాబును వదలట్లేదు.. దీంతో చివరికి దిగివచ్చిన నాగబాబు చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం ట్విట్టర్ అకౌంట్ నుంచి డిలీట్ చేయడం జరిగింది..

అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం..

ఇప్పుడు వైఎస్ఆర్ సీపీకి చెందిన పోతిన మహేష్ నాగబాబుపై ఘాటు విమర్శలు సంధించారు.. నాగపాము కి పాలు పోసినా అది కాటు వేస్తుందని.. నాగబాబు కూడా అలాంటి వాడే అని ఆయన స్పష్టం చేశారు . వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ అసలు తెలుస్తుందా అంటూ చురకలు అంటించారు.. ముఖ్యంగా వారికి సహాయం చేసిన వారి పట్ల ఏమాత్రం కృతజ్ఞతా భావంతో మెగా కుటుంబం ఉండదు అని ఆరోపించారు..

తన మామయ్య నాగబాబు ఆర్థిక పరిస్థితి బాగోలేదనే ఉద్దేశంతో అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించారని..సినిమా పూర్తి కాకముందే మూడు కోట్ల రూపాయలను కూడా ఇప్పించారని మహేష్ గుర్తు చేశారు.. అంతేకాదు దీంతో పాటు మరో రెండు సినిమాలలో నాగబాబుకు అవకాశాలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్నాడని.. పుష్ప సినిమా తర్వాత జనసేనకి 2 కోట్ల రూపాయల ఫండ్ కూడా ఇచ్చాడని తెలిపారు..

అయినా సరే అల్లు అర్జున్ పై నాగబాబు విషం చిమ్మడం సిగ్గుచేటు అని కామెంట్ చేశారు. అంతేకాదు తమ కుటుంబానికి గీత ఆర్ట్స్ అండగా నిలిచిందని.. అలాంటి గీత ఆర్ట్స్ పైనే నాగబాబు తన కుళ్ళు కుతంత్రాలను బయటపెట్టారని.. మెగా ఫ్యామిలీ ఒక దగా ఫ్యామిలీ అని ఆయన తెలిపారు.. మొత్తానికి అయితే నాగబాబుపై ఇలా ఎవరికి తోచిన వాళ్ళు కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nagupamu - Nagababu are one and the same

You cannot copy content of this page

Scroll to Top