త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
✓ఒక్కొక్కరు ఒక లక్ష్యంతో ప్రయాణం
✓ఉద్యోగం కోసం ప్రయాణం
✓ ఉపాధి కోసం ప్రయాణం
✓ విద్యకై ప్రయాణం
✓వైద్యం కై ప్రయాణం
✓డైలీ లేబర్ పనుల కోసం ప్రయాణం
✓ఇంటి సామాగ్రి, ఒంటి సామాగ్రి,వంట సామాగ్రి కోసం ప్రయాణం
✓శుభ, అశుభ కార్యక్రమాల కోసం ప్రయాణం
✓ ఇలా విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, రైతులు, వ్యవసాయ కూలీలు , అడ్డా కూలీలు, నిరుద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు( రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు,పండ్ల బండి వారు, బార్బర్ లు, చిన్న సన్నకారు కుటీర పరిశ్రమల వారు, పాల వ్యాపారులు ఇలా అనేక రంగాలలో ఉన్న ప్రతి మనిషి తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నిరంతరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రాంతానికి పనుల నిమిత్తం ప్రయాణం చేస్తుంటారు.
ఆ ప్రయాణాల్లో ఎవరికి ఏ క్షణం లో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని స్వచ్చమైన అమాయకపు మనసులు అవి. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియదు. గమ్యం కోసం పోరాటం లో మళ్ళీ గడప తొక్కుతమో లేదో తెలియని ప్రాణాలు అవి. కుటుంబ పెద్ద దిక్కు ను చిదిమేస్తున్న ప్రయాణ ప్రమాదాలు.
దిక్కు తోచని అంధకారంలోకి వెళ్తున్న కుటుంబాలు. ఇలాంటి ప్రయాణ ప్రమాద ఘటనలు కోకొల్లలు జరిగాయి. మరి ప్రమాదాలకు కారణం ఎవరు డ్రైవరా? రోడ్డా? చెట్లా? వాతావరణమా? ప్రయాణికులా? ప్రభుత్వమా? ఎవరు ఇందులో కారణదాత?
….. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఏమున్నది గర్వకారణం , ఎనూకటికంటే ఇప్పుడే ఎక్కువ ప్రమాద ఘటనలు.
… ప్రమాదాల్లో పేదోల్ల ప్రాణాలే పోవాలా, పెద్దోళ్ల ప్రాణాలు ఎందుకు పోకూడదు,
….. పరామర్శలు, పరిహారాలు, కాండిల్ ర్యాలీలు ఏ ఒక్క ప్రాణాన్ని తెచ్చివ్వ గలదు.
….. చేవెళ్ల@మీర్జాగూడ ఘటనలో సుమారు 30 మంది మరణించారు.
ఆయా కుటుంబాల్లో ఉన్న చీకటిని, బాధ్యతలను, బాధలను,అందకారాన్ని తొలగించగలరా ఈ రాజకీయ నాటకులు .
…… ప్రమాదాలను ముందే పసిగట్టి రోడ్డు బాగుకోసం ఒక వర్గం పోరాటం.
…….. రోడ్డు కు ఇరువైపుల రోడ్డు విస్తరణకు చెట్లను నరికివేస్తున్నారని కోర్టులో కేసు వేస్తాడు ఇంకోడు.
…….. రోడ్డు విస్తరణ కోసం పాటు పెద్దవాడు బాగానే ఉన్నాడు..
….దాన్ని కోర్టు కేసు ద్వారా నిలిపివేసిన వాడు బాగానే ఉన్నాడు.
… కల్మషం లేని , అమాయకపు మనుషులు మరణించారు.
……. చట్టం ఎవరినీ శిక్షించాలి ఈ కేసులో ?
.. ఒకడిని చంపితే జీవిత ఖైదు వేస్తారు కదా మరి సుమారు 30 మంది చావుకు కారణం అయిన వారిని అసలు గుర్తిస్తారా? శిక్షిస్తారా? ఎలాంటి శిక్ష? ఎంత కాలం?
…… ఈ రాజకీయ నాయకుల చేతిలో ఈ కేసు నీరుగారుతుందా?
… ఓ ప్రభుత్వమా మరణించిన ✓కుటుంబాలకు ఒక్కొక వ్యక్తికి 50 లక్షల ఎక్స్ గ్రేసియా ఇవ్వాలి
✓ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
✓ ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలి.
………. క్షతగాత్రులకు కూడా పరిహారం తో పాటు పూర్తిగా కోలుకున్నంత వరకు ప్రభుత్వమే పూర్తిగా ఉచిత మెరుకైన వైద్యం అందించాలి.
మక్తల రవి చిట్యాల
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


