WhatsApp Image 2024 03 07 at 12.21.10
Trinethram News : ఎంపీ ఎంవీవీ చీప్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి ఒక ప్రకటనలో ఆరోపించారు.తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా గెలవడానికి మహిళలకు నాసిరకం చీరలు పంచి మహిళలను అవమానిస్తున్నారని, నిజంగా మహిళల మీద గౌరవం ఉంటే వారి కాళ్ల మీద వారు నిలబడటానికి చిన్న తరహా పరిశ్రమలు కుట్టు కేంద్రాలు, పచ్చళ్లు తయారి , చేతి వృతుల కేంద్రాలు వంటివి ప్రతి వార్డులో ఏర్పాటు చేస్తే మహిళలకు ఉపాధి లభిస్తుందని, నెలనెలా ఆదాయం వస్తుందని, ఆ పని ఎంవీవీ చేయగలరా అని ఆమె సవాల్ విసిరారు.
