వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. క్రీడలు మనిషిలోని దేహ దారుడ్యాన్ని పెంచడమే కాక మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తాయని వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ అన్నారు. వికారాబాద్ పట్టణంలోని మిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన ఎంవీపీల్ సీజన్ 1 టోర్నమెంట్ లోగో ను చిగుళ్లపల్లి రమేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. నేటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి చెడు అలవాట్లకు బానిసవుతుందనిఅలాంటి చెడు మార్గాలలో వెళ్లకుండా క్రీడలకు కూడా సమయాన్ని ఇవ్వాలని అన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ… నెల రోజుల పాటు కొనసాగే ఈ టోర్నమెంట్.. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుందని అన్నారు. కిరాక్ బాయ్స్, అనంతగిరిపల్లి దగాడ్స్, రెడ్ సి, ఇన్ఫినిటీ క్రికెట్ క్లబ్, కొత్తగాడి 11, లైబ్రరీ టీమ్ లాంటి 6 టీమ్ ల మధ్య టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


