Mutyala Sarvaiah Joins BRS : కాంగ్రెస్ పార్టీని వీడి బీ ఆర్ ఎస్ లోచేరిన ముత్యాల సర్వయ్య

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ మార్చ్ 11, త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ముత్యాల సర్వయ్య తోపాటు వందలాది మంది నాయకులు బిఆర్ఎస్ పార్టీ లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ల సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన…. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్… కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తూ పరిపాలన చేస్తోంది… రైతులకు రైతుబంధు వెయ్యకుండా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం.. పదేళ్లలో రైతులకు ఏ ఇబ్బంది కాకుండా కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతులను ఆదుకున్నారు… రైతుబంధు డబ్బులను ఎగ్గాడుతూ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి పబ్బం గడుపుతున్నడు రేవంత్ రెడ్డి
ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు…. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులకు స్వర్ణయుగం, అన్నదాతలు చాలా సంతోషంగా జీవించారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అరిగోసా పడుతున్నారు…. యూరియా, కరంట్, నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది
-కేసీఆర్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అయితే.. రేవంత్ రెడ్డి విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్
-తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించి, అభివృద్ధి అంటే ఏంటో దేశానికే చూపించిన దార్శనికుడు కేసీఆర్…. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి శూన్యం. సంక్షేమ పథకాలన్నింటికీ కోత పడింది.
నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయింది. ఆనాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డి అందరూ బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ, 100 రోజులు కాదు కదా.. 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ ఆరు గ్యారెంటీలు అమలవుతున్న దాఖలాలు లేవు.
ఎస్సీ డిక్లరేషన్ పేరిట దళితులకు 18% రిజర్వేషన్లు, ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని మోసం చేశారు. -చదువుకునే పిల్లలకు టెన్త్ పాస్ అయితే రూ. 10,000, ఇంటర్ పాస్ అయితే రూ. 25,000, డిగ్రీకి రూ. 50,000, పీజీ చదివితే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి.. ఈరోజు వరకు ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కూడా రావడం లేదు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభకు సిద్దరామయ్య గారిని తీసుకొచ్చి, బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, ఏటా రూ. 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక బీసీలకు కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపింది. వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ మాయమాటలు చెప్పారు. ఏటా రూ. 15,000 రైతుబంధు, పంటల బీమా, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను నిలువునా దగా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, యువత.. ఇలా అన్ని వర్గాలను మోసం చేసింది. గతంలో అవ్వాతాతలకు కేవలం రూ. 200 ఉన్న పెన్షన్‌ను కేసీఆర్ గారు రూ. 2,000 చేశారు. కానీ కాంగ్రెస్ నేతలు తాము డిసెంబర్‌లో గెలిచిన మరుసటి నెల నుంచే రూ. 4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. 28 నెలలు గడుస్తున్నా ఆ 4000 పెన్షన్ రాలేదు.
మహిళలందరికీ నెలకు రూ. 2,500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పటిదాకా ఒక్క మహిళకు కూడా ఆ డబ్బులు ఇవ్వలేదు. తక్షణమే ఈ బడ్జెట్‌లో మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చేలా నిధులు కేటాయించాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇప్పటికీ కూలీలకు డబ్బులు అందలేదు, పంటల బీమా రాలేదు.
యువత కోసం ప్రవేశపెడతామన్న రాజీవ్ యువ వికాసం అమలు కాలేదు. ఏ ఒక్క యువతీయువకుడికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. బడ్జెట్‌లో చెప్పిన మాటలకు కూడా విలువ లేకుండా చేశారు. కనీసం ఈ బడ్జెట్‌నైనా వాస్తవాల ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా రూపొందించాలి. రూ. 4000 పెన్షన్, మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చే హామీలను అమలు చేసేలా ఈ బడ్జెట్‌లో నిధులు ఇవ్వాలి అని ప్రజల తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mutyala Sarvaiah leaves Congress party and joins BRS

You cannot copy content of this page

Scroll to Top