తేది:20.12.2024.
జోగుళాంబ గద్వాల్ పోలీస్
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి
పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలో విసిబుల్ పోలీసింగ్ ను మరింత పెంచాలి
గట్టు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన —— జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు
గ్రామాల లో విజిబుల్ పోలింగ్ ను పెంచీ మరింత నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు పోలీస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
వార్షిక తనీఖీల్లో భాగంగా ఈ రోజు గట్టు పోలీస్ ను జిల్లా ఎస్పీ గారు తనీఖీ చేసారు.
అందులో భాగంగా జిల్లా ఎస్పీ గారు స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును,రికార్డ్స్ పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని ఎస్పి గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, కోర్ట్ లో పెండింగ్ లో వున్న కేసులు, వాటికి సంబందించిన దర్యాప్తు వివరాలను, రోడ్డు ప్రమాదాల నివారణకు ,నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ఎస్పి గారు ఎస్సై ను అడిగి తెలుసుకున్నారు. మరియు స్టేషన్ లో నిర్వహిస్తున్న పలురకాల రికార్డులను , స్టేషన్ పరిసరాలను, మెన్ బ్యారక్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు పరిశీలించి ఫ్రిజ్ అయిన అమౌంట్ ను కోర్టు అనుమతీ ద్వారా బ్యాంకర్లతో మాట్లాడి బాధితులకు అందజేయాలని సూచించారు.
స్టేషన్ సిబ్బంది తో ఎస్పి గారు మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలన్నారు . నేరాల కట్టడి కొసం అధికారులు మరింత శ్రమించడంతో పాటు, నేరం జరిగిన వెంటనే స్టేషన్ అధికారులు వేగంగా స్పందించాలని చట్టాలను అతిక్రమించి చర్యలకు పాల్పడే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్స్టే షన్ పరిధిలో జరిగే ప్రతి విషయం ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు, ముందస్తూ సమాచార సేకరణ అవరమని, బ్లూ క్లోట్స్ సిబ్బంది డయాల్ 100 కాల్స్ కి వెంటనే స్పందించి వారు సంఘటన స్థలంకి త్వరగా చేరుకోవాలని సూచించారు. గ్రామాలలో బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బంది విసబుల్ పోలిసింగ్ ను మరింత పెంచాలని సూచించారు.vpo లు తమకు కేటాయించిన గ్రామం లో పూర్తి నిఘా ఉంచాలని, గ్రామాలలో రౌడి షీటర్లు , సస్పెక్ట్ లను తరచు తనిఖీలు చేస్తూ ఉండాలనీ, గ్రామం లొకి ఎవరైన కొత్తవారు వస్తున్నారా, ఏ పనీ పై వస్తున్నారు, ఏమైన నేరాలు జరిగేందుకు అవకాశం ఉందా వంటి విషయాలు ముందస్తుగా తెలుసుకోవాలన్నారు. ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి,మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని, సరి హద్దు గ్రామాలలో PDS , ఇసుక, ఇతర అక్రమ రవాణ పై నిఘా ఉంచి పట్టకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ లో మొక్కను నాటి స్టేషన్ ఆవరణ లో పర్యావరణాన్ని సంరక్షించాలని ఆదేశించారు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు తో జిల్లా ఎస్పీ గారు స్వయంగా పిటిషన్ ను స్వీకరించి కేసును త్వరగ చెదించడం గురించి ఎస్సై మల్లేష్ కు తగు సూచనలు చెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గద్వాల్ సీఐ టి శ్రీను పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాంబ గద్వాల్ జిల్లా
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App