అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్

TRINETHRAM NEWS

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్
Trinethram News : వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో వికారాబాద్ మున్సిపల్ ను మరింత అభివృద్ధి చేస్తామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు, 7వ వార్డు, 26వ వార్డు, 33వ వార్డులలో యుజిడి పైప్ లైన్ పనులకు, మ్యాన్ హాల్ రిపేరింగ్ పనులకు *మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి తో కలిసి చైర్ పర్సన్ కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు సునీత రమేష్ గౌడ్, సంతోష నర్సింలు, నాయకులు రమేష్ గౌడ్, నర్సింలు, సురేష్, మల్లికార్జున్, శ్రీనివాస్ ముదిరాజ్, బందయ్య, AE అనిల్, కాంట్రాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top