Prema Kumar : సఖి సురక్ష అభియాన్ – ఆరోగ్యమైన విద్యార్థిని, ధైర్యవంతమైన స్త్రీ – బలమైన దేశం కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

TRINETHRAM NEWS

కూకట్పల్లి ఆగస్టు 25 : (త్రినేత్రం న్యూస్) ఈ రోజు జె ఎన్ టి యు దగ్గర (ఐజిఎన్ఐటిఈ) జూనియర్ కాలేజీ లో, ప్రైమ్ 9 సీఈవో కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సఖి సురక్ష అభియాన్ కార్యక్రమంలో అమ్మాయిల ఆరోగ్యం, ఇంటిమేట్ హైజీన్, పిసిఒడి/పిసిఓఎస్ వంటి సమస్యలపై అవగాహన కల్పించబడింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రేమ కుమార్ విద్యార్థినుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ:“హైజీన్ అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే ఆత్మవిశ్వాసం. ప్రతి అమ్మాయి తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ‘నా శరీరం – నా సంరక్షణ – నా గౌరవం’ అనేది ప్రతీ ఒక్కరి నినాదం కావాలి” అని సూచించారు.
పిసిఒడి/పిసిఓఎస్ సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, సమయానికి వైద్య సలహాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పారు.విద్యార్థినుల ఆరోగ్యం అంటే సమాజ శ్రేయస్సు, ఆరోగ్యవంతమైన మహిళ సమాజానికి బలం, దేశానికి శక్తి అని పిలుపునిచ్చారు.అలాగే మహిళల కోసం సురక్షిత వాతావరణం, పోషకాహారం, శారీరక వ్యాయామం, రెగ్యులర్ హెల్త్ చెకప్ అవసరాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వేముల మహేష్, పోలెబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు తదితరులు పాల్గొని విద్యార్థినులకు ప్రోత్సాహం అందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mummareddy Prema Kumar participated

You cannot copy content of this page

Scroll to Top