కూకట్పల్లి ఆగస్టు 25 : (త్రినేత్రం న్యూస్)పర్యావరణ హితమే లక్ష్యంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అందించిన మట్టి వినాయక విగ్రహాలను డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద కార్పొరేటర్ చేతులమీదుగా డివిజన్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది కావున మట్టి విగ్రహాలను పూజించి వినాయక పండుగ ఘనంగా జరుపుకోవాలని అన్నారు.
విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, విషపదార్థాలు ఉపయోగించడం వల్ల వృక్ష, జంతు జీవనంపై ప్రభావం పడుతుందన్నారు. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది కాబట్టి ప్రజలందరూ మట్టి గణనాథులనే పూజించాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, మల్లేష్, షౌకత్ అలీ మున్నా, లింగం, రాజుగౌడ్, అర్వరవి, సంపత్, ఎస్.ఆర్.పి ఎ. నాగేశ్వర నాయక్, ఎస్.ఎఫ్.ఏ మల్లేష్, జి.ఎచ్.ఎం.సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


