జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 18/06/2025. న్యూఢిల్లీ : ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంటు ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) న్యూఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధనకర్ ను ఆయన నివాసంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఉపరాష్ట్రపతిని మంత్రి నారా లోకేష్ శాలువాతో సత్కరించారు.
రెండు వందల ఇరవై ఆరు రోజులపాటు మూడు, వేల నూటముప్పై రెండు కిలో మీటర్ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను కళ్ళకు కడుతూ రూపొందించిన యువ గళం పుస్తకాన్ని అందజేయడం జరిగింది. పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల్లో చైతన్యాన్ని నింపడం జరిగిందని అన్నాడు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పి. చంద్రశేఖర్, ఎంపీలు లావు. కృష్ణదేవరాయులు, మాగంటి శ్రీనివాస్ రెడ్డి, యస్. సతీష్ బాబు, బైరెడ్డి శబరి పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MP meets Minister and

You cannot copy content of this page