జూన్ 26, 2026
TRINETHRAM NEWS

నాలుగు నాటు పడవలతో ముమ్మర గాలింపు చర్యలు చేయించిన డిప్యూటీ కమీషనర్ చక్రధరరావు….

సహకారం అందించిన ఎస్ డీ ఆర్ ఎఫ్,రెవెన్యూ,పోలీస్ బృందాలు….

ఆత్రేయపురం: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం. గత మూడురోజుల క్రితం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చి గోదావరిలో స్నానం చేస్తూ గల్లంతయిన యువకుని కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధరరావు కోటిపల్లి,కూళ్ల,రావులపాలెం,కేదార్లంక,మందపల్లి,కోటిపల్లి కి చెందిన మత్స్యకారులతో సంప్రదించారు.నాలుగు నాటు పడవలను ఏర్పాటు చేసిమత్స్యకారులతో కలిసి ఆలయ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.వీరికి ఎస్ డీ ఆర్ ఎఫ్,రెవెన్యూ,పోలీస్ బృందాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి.మూడు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Monitoring for a missing youth

You cannot copy content of this page