
ఎమ్మెల్సీ వార్ వన్ సైడ్ చేసేందుకు జోరుగా కూటమి ప్రచారం
గ్రాడ్యుయేట్స్ అందరినీ కలిసి మద్దతు కోరుతున్న పంతం నానాజీ, కుడిపూడి సత్తిబాబు, కూటమి నాయకులు
Trinethram News : కాకినాడ రూరల్, ఫిబ్రవరి 14 : ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం రూరల్ మండలంలోని వాకలపూడి, సర్పవరం గ్రామాలలో ఉన్న ఎమ్మెల్సీ ఓటర్లతో సమావేశం నిర్వహించి కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, విశాఖ సౌత్ జోన్ పార్టీ ఇంచార్జి మరియు ఎన్టీఆర్ వైద్య సేవా కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ హాజరయ్యారు.
సమావేశంలో కుడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ ప్రజాబలంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రౌడీయిజం తగ్గిందని, జగన్ ప్రభుత్వంలో పెంచి పోషించిన గంజాయి, రౌడీ మూకలకు కాలం చెల్లిందన్నారు. గ్రాడ్యుయేట్ల సమస్యలను శాసనమండలిలో వినిపించి, సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వంలో భాగంగా పనిచేసేందుకు పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దడం, స్థానికంగా పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు సృష్టించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి విజయం చేకూర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో-కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబి, మూడవ క్లస్టర్ తాతిపూడి రామకృష్ణ, సర్పవరం గ్రామ కమిటీ అధ్యక్షులు గోవిందు మరియు జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
