WhatsApp Image 2024 01 30 at 12.59.07 PM
Trinethram News : అమరావతి:
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఇన్‌చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు..
అయితే ఈ నాలుగు జాబితాల్లో పేరు రాని నేతలంతా సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు..
నేడు సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రులు గుడివాడ అమరనాథ్, ఉషశ్రీ చరణ్, ఎంఎల్ఏ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వచ్చారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. రానున్న ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ కసరత్తులు చేస్తోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థులకు నియోజకవర్గాలను కేటాయిస్తోంది..
