తేదీ : 06/10/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); గుడివాడ నియోజకవర్గం, పట్టణ పరిధిలోని అంతర్గత డ్రైనేజీల సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సాధించాలని, శాసనసభ్యులు వెనిగండ్ల. రాము సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం క్రమం తప్పకుండా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా వేదిక కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణ శివారు కాలనీలైన ధనియాల పేట , వాంబే, న్యూ ఇందిరానగర్ కాలనీలో రూపాయలు పది కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు రాముకు వివరించారు. అదేవిధంగా సత్యనారాయణపురం మరియు అంతర్గత డ్రైనేజీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని , ప్రణాళికలతో వాటిని అభివృద్ధి పరచాలని ఆయన అన్నారు. టిడ్కో కాలనీ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని కూడా పరిష్కరిస్తాము అని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీవో బాలసుబ్రమణ్యం, కమిషనర్ సింహాద్రి మనోహర్, ఎం. ఈ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డి. రాంబాబు, లింగం ప్రసాద్, సాంబయ్య, మునిసిపల్ డీఈలు, శివాజీ, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


