MLA who Inaugurated the Borehole : బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 28/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ ఇరవై ఎనిమిది గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని , అదేవిధంగా తమ వంతు సహకారం అందించాలని, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల. రాము అన్నారు. గ్రామాల్లో త్రాగు సాగునీటి వ్యవస్థలను మెరుగుపరిచినట్లు ఆయన తెలపడం జరిగింది. రూరల్ మండలం లింగవరం గ్రామంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన పంచాయితీ బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలను పాడి రైతులకు అందజేశారు. అనంతరం సాగునీటి పంట కాలు వలను రైతులతో కలిసి పరిశీలించారు. ఆ కాలువల్లో నీటి ప్రవాహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అన్నారు. ముఖ్యంగా పేద వర్గాల అభ్యున్నతికి గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పి – నాలుగు లో ప్రావాసాంద్రులు, దాతలు, భాగస్వామ్యులు కావాలన్నారు. ఏడాది పాలనలో నియోజకవర్గంలోని గ్రామాల ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నామన్నారు. త్రాగు, సాగునీటి వ్యవస్థల మెరుగుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ బూరగడ్డ. శ్రీకాంత్, టిడిపి నాయకులు చేకూరు .జగన్మోహన్రావు, గాది రెడ్డి, చిరంజీవి రెడ్డి, మందపాటి. గోపాలకృష్ణ, కొత్తకోట .వెంకట శివ నాగరాజు, పెనుగోలు. శ్రీనివాసరావు, గాదిరెడ్డి. చిన్నబాబు, మార్కు రా జ్, కల పాల. మాణిక్యాలరావు, కాటూరి. ఏసు పాదం, రవి, రామ్మోహన్ రావు, ఆర్ దబ్ల్యూ సి ఎ ఈ ఇంచార్జ్ ప్రభావతి, కార్యదర్శి అమల, వెటర్నరీ అధికారి లోకేష్, సచివాలయ సిబ్బంది పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA who inaugurated the

You cannot copy content of this page

Scroll to Top