గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ 57వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాతపెల్లి ఎల్లయ్య వారి నివాసంలో పరామర్శించారు. ఇటీవల ఎల్లయ్య కాలు సర్జరీ జరిగిన నేపథ్యంలో వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
గోదావరిఖని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్యులు సూచించిన చికిత్సను పూర్తిగా అనుసరించుకోవాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎల్లప్పుడూ ప్రజలతో కలిసిమెలిసి పనిచేసిన ఎల్లయ్య ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


