త్రినేత్రం న్యూస్, జనవరి 31, మండపేట, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. 1వ తేదికి ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగ శనివారం మండపేట పట్టణంలో 20, 24వ వార్డులలో డయాలసిస్ పేషెంట్లకు రూ.10000/- లు మరియు స్పౌజ్ కోటాలో రూ.4000/- లు కొత్తగా మంజూరైన పించన్లను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, పంపిణీ చేశారు.
ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, పెరాల్సిస్, బెడ్ రిడెన్ కి సంబంధించి రూ.15000/- లు కొత్త పించన్లు 11 మంజూరు అయ్యాయని వీటితోపాటుగా డయాల్సిస్ 2, స్పౌజ్ పించన్లు 8, వికలాంగుల పించన్ 1 మొత్తం 22 పించన్లు మండపేట పట్టణంలో శాంక్షన్ అయ్యాయని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడింటి సూర్యప్రకాష్, టేకి వెంకటరమణ, సత్తిబాబు, పేరూరి ఏసుబాబు, గండి నాగేశ్వరరావు, మార్గాని గంగభవాని, కడియాల వెంకట లక్ష్మి, కడియాల గోవింద్, కాళ్ళ ఆనంద్, నురుకుర్తి శివ కుమార్, గుత్తుల మణికంఠ, గుత్తుల వీర్రాజు, జొన్నకూటి రాజు, పంపన కృష్ణమూర్తి, దొంగల మల్లేష్, కడియాల దుర్గబాబు, నురుకుర్తి దేవి, ధర్మవరపు నాగ దుర్గ, మున్సిపల్ కమిషనర్ టి.వి.రంగారావు, సచివాలయ సిబ్బంది, తదితర్లు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


