త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పనసమ్మ జిల్లా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అంతా అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో రూ.70 లక్షలతో సి.సి రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి ఆదివారం ఆయన శంఖుస్ధాపన చేశారు. రాష్ట్రంలో రోడ్లకు పూర్వ వైభవం తెచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శ్రీకారం చుట్టారని అన్నారు. వేలకోట్ల నిధులతో గుంతలు పూడ్చడం, మరమ్మత్తులతో పాటు నూతన రోడ్ల నిర్మాణం చేస్తున్నారన్నారు. “నాడు” గుంతల మయమైన రోడ్లు “నేడు” సుందరంగా చేయటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. తొలుత ఎమ్మెల్యే వేగుళ్ళ కు గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ గ్రామంలో పలు చోట్ల కొబ్బరికాయ కొట్టి సి.సి రోడ్లు నిర్మాణానికి శంఖుస్ధాపన చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు చుండ్రు రాజు, రామచంద్రాపురం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, మండలపార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి మాధవరావు, ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, అమలాపురం పార్లమెంట్ ఉపాధ్యక్షులు వై.ఆర్.కె.పరమహంస, మాజీ సర్పంచ్ లు నూని ఏసుబాబు, నూని శ్రీదేవి, మోరంపూడి రాజ్ కుమార్, ఎంపిటిసి గొల్లపల్లి అనురాధ, వార్డు మొంబర్లు ముత్యాల అనురాధ, చుండ్రు రామారావు, కురుపూడి లీలాదేవి, మాజీ వైస్ ఎంపిపి దేవు శ్రీను, కొప్పిశెట్టి సత్యనారాయణ, కురుపూడి నాగరాజు, మామిడిశెట్టి రామకృష్ణ, కాదా శ్రీను, బవిరిశెట్టి అప్పారావు, కురుపూడి రాజు, పసల విధ్యాధర్, మనీష్, జనసేన నాయకులు కొండేపూడి ఆనంద్, అడ్డగాళ్ళ నరేష్, సుంకర సంతోష్, గొల్లపల్లి రమణ, దాలిపర్తి శ్రీను, మేడపాటి రవీంద్రరెడ్డి, మతుకుమిల్లి ప్రసాద్, ఉండవిల్లి రాంబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పంచాయితీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


