త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రామకృష్ణ విలాస్ అధినేత, మండపేట టౌన్ టీడీపీ మాజీ అధ్యక్షులు బండారు రామచంద్రరావు మృతి పట్ల రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దకాపు నిబద్దత కలిగిన వ్యక్తి అన్నారు. 2004, 2009 ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో తనతో పాటు పాల్గొని గెలుపుకు కృషిచేశారన్నారు. 2014, 2019 లో వారి ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ మండపేట వచ్చి ఓటు వేశారన్నారు. ఇటువంటి వ్యక్తి మరణం పార్టీకి తీరనిలోటు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


