జూలై 16, 2026
TRINETHRAM NEWS
MLA surprise inspection

MLA Surprise Inspection : దేవరకొండ డివిజన్ జూన్ 17, త్రినేత్రం న్యూస్. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న భోజన వసతులను పరిశీలించి, భోజనం నాణ్యత ఎలా ఉందని రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు, సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద మరియు మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఆసుపత్రిలో పరిశుభ్రత, సేవల నాణ్యతను ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page