ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
MLA Roshan Kumar

యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన రోషన్
ప్రజాజీవనం నకు ఆటంకం కలిగించే వారిపై చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే

MLA Roshan Kumar : త్రినేత్రం న్యూస్ : చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం గ్రామంలోని ఏపీ రెసిడెన్షియల్ బాలికల ఉన్నత పాఠశాల లో నీటి సమస్య నెలకొందన్న సమాచారం తెలుసుకున్న చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ తక్షణం స్పందించారు. గతంలో ఎన్నడూ లేని ఈ సమస్య ఎందుకు తలెత్తిందనే విషయంపై అధికారులతో మరియు స్థానిక నాయకులతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆరా తీశారు.

కొంతమంది ఆకతాయిలు తరచూ నీటి సరఫరా చేసే గేటు వాల్స్ తమ ఇష్టానుసారంగా తిప్పుకొని రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్లాల్సిన నీటిని మళ్లించడం కారణంగా సమయపాలనలో వ్యత్యాసం రావడంతో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని అధికారులు ఎమ్మెల్యే కు వివరించారు.
దాంతో స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ పోలీస్ అధికారులకు ఈ విషయంపై ఆ ప్రాంతంలో పర్యటించి, విచారణ జరిపి మరోసారి ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు ఆదేశించారు .
మున్సిపల్ అధికారులు తక్షణం పాఠశాల విద్యార్థులకు నేటి సరఫరా లో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదేశించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page