ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
MLA Congratulates Pravalika.

MLA Congratulates Pravalika : డిండి (గుండ్ల పల్లి)జూలై 12, త్రినేత్రం న్యూస్. చైనాలోని ఓర్డోస్‌లో జరిగిన 1వ ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే రేసులో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించిన గ్రామీణ క్రీడా కెరటం నారిమల్ల ప్రవళికకు దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

డిండి మండల కేంద్రానికి చెందిన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నా నారిమల్ల ప్రవళిక అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించడం మన గ్రామీణ ప్రాంతాల్లోని అద్భుతమైన ప్రతిభకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన ఒక ఆడబిడ్డ అంతర్జాతీయ క్రీడా వేదికపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేయడం మనందరికీ గర్వకారణం అని ఎమ్మెల్యే బాలు నాయక్ హర్షం వ్యక్తం చేశారు.

డిండి మైదానంలో కఠినమైన శిక్షణ పొంది, ఆదివారం చైనా వేదికగా బంగారు పతకం గెలవడం రాష్ట్రంలోని వేలాది మంది యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకం.ప్రవళికను ఒక అంతర్జాతీయ ఛాంపియన్‌గా తీర్చిదిద్దడంలో అహర్నిశలు కృషి చేసిన ఆమె కోచ్ పస్పుల పరుశురాముడు స్పోర్ట్స్ అకాడమీ యాజమాన్యానికి ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా మౌలిక వసతులను మరింత మెరుగుపరచడానికి, ప్రతిభావంతులైన యువతకు ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు అందించడానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని నేనావత్ బాలు నాయక్ స్పష్టం చేశారు. నారిమల్ల ప్రవళిక భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page