సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
MLA Review Meeting

MLA Review Meeting : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 23 ; కొయ్యలగూడెం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని అన్ని శాఖల అధికారులతో పోలవరం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ శాఖల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,మండల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అధికారులు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్యుత్, వ్యవసాయం, విద్య, వైద్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వాళ్లను ఆదేశించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా , అందుబాటులో ఉండాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు అవసరమైన ప్రభుత్వ సహాయం, పథకాలు, సాగుకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
పంచాయతీల పరిధిలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పంచాయతీ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన సేవలు సక్రమంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తవుతాయని , ప్రజల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని గుర్తు చేశారు.
ఈ సమావేశంలో ఎంపీడీవో, తహసిల్దారు, వ్యవసాయ శాఖ అధికారి, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page