దేవరకొండ డివిజన్ (నేరేడుగొమ్ము) అక్టోబర్ 16.త్రినేత్రం న్యూస్. నేరేడుగొమ్ము మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, ఆర్వో వాటర్ ప్లాంట్ ను దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని అందించాలని లక్ష్యంతోనే మోడల్ స్కూల్ లో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తుందని , గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు పౌష్టికమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.
ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయని అన్నారు. ఆర్వో వాటర్ ప్లాంట్ కు సహకరించిన శ్రీను నాయక్ ని శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


