ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS
MLA Nenavath Balu

– దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

MLA Nenavath Balu : చందంపేట జులై 27, త్రినేత్రం న్యూస్. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాది అని, ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. ఓటు హక్కును కాపాడుకోవడం కేవలం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాకుండా, దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించే జాతీయ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

చందంపేట మండల రైతు వేదికలో నిర్వహించిన SIR ప్రక్రియపై అవగాహన సమావేశంలో బీఎల్ఓలు, బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు..
ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం ప్రజలదేనని, ప్రజల ఓటు కంటే గొప్ప శక్తి మరొకటి లేదని ఎమ్మెల్యే బాలు నాయక్ గారు స్పష్టం చేశారు. ప్రజలు తమ ఓటు విలువను గుర్తించి అప్రమత్తంగా ఉంటేనే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటాయని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page