Gas Cylinders Seized : 19 గ్యాస్ సిలిండర్లు సీజ్, 7 హోటల్స్ పై కేసులో నమోదు అదనపు కలెక్టర్ డి.వేణు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెద్దపల్లి, ప్రతినిధి.. గోదావరిఖని ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో 19 సిలిండర్లు సీజ్ చేసి, 7 హోటల్స్ పై కేసులను నమోదు చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ డి.వేణు ఒక ప్రకటనలో తెలిపారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం గోదావరిఖని ప్రాంతంలోని వివిధ హోటల్స్ లో తనిఖీలు నిర్వహించడం జరిగిందని , గృహ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 7 హోటల్స్ పై కేసులు నమోదు చేసి 19 సిలిండర్లు సీజ్ చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

19 gas cylinders seized

You cannot copy content of this page

Scroll to Top