జూన్ 26, 2026
TRINETHRAM NEWS

అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి.. ఆకెనపల్లి గ్రామం లో గ్రామ సర్పంచ్ గాదె స్రవంతి-సుధాకర్ ఉప సర్పంచ్ ఐలవేణి అనసూర్య, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన పాల్గొని ఆత్మీయంగా సన్మానించారు ఎమ్మెల్యే రాజ్-మనాలి ఠాకూర్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రజా పాలన నేపథ్యంలో ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు అందించాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. ఈ నేపథ్యం లోనే రైతులకు సాగు, తాగు నీరు అందించడంతోపాటు సకాలంలో పంట పండించేందుకు తగిన సహకారం అందిస్తున్నామన్నారు. అదేవిధంగా పంట దిగుబడికి సంబంధించి గిట్టుబాటు ధరను రైతులకు అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

రైతులను సంపన్నులుగా చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపట్టిందన్నారు. సన్న చిన్నకారు రైతులను సర్కారు అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. గ్రామాలలో అభివృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి సాధిస్తుందనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాలపై ముందుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అదే క్రమంలో కొత్తగా ఏర్పాటైన పాలకులు ప్రజా సంక్షేమంతో పాటు గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పని చేయాలన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలు లేని పల్లెలుగా తీర్చిదిద్ది ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA MS Raj Thakur participated in the oath taking ceremony

You cannot copy content of this page