దేవరకొండ ఆగష్టు 18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎం కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ప్రజా ప్రతినిధులు మరియు అధికారులతో కలిసి దేవరకొండ ఎం ఎల్ ఏ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే దృఢసంకల్పంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. సకాలంలో ప్రహరీ గోడ నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


