జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : దీక్షా దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రేపు ఉదయం గండి మైసమ్మలోని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న దీక్ష కార్యక్రమ ఏర్పాట్లలో భాగంగా సభా వేదికతో పాటు స్థానిక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన భోజన ఏర్పాట్లను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్ర సాధనకై తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాల సాక్షిగా స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా బిఆర్ఎస్ అధినేత, పెద్దలు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి మరీ పోరాడారని తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన నాయకుడు కేసీఆర్ ని అన్నారు. వారి పోరాట పటిమను నేటి యువతరానికి తెలియజేసేలా ఈ దీక్ష దివాస్ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రతీ ప్రజాప్రతినిధి, నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని దీక్షా దివాస్ ను విజయవంతం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA KP Vivekanand inspected "Deeksha Diwas" program ...

You cannot copy content of this page