-కేసీఆర్ సంకల్ప బలానికి, దీక్షాదక్షతకు సాక్ష్యం దీక్షా – దివస్
-అరవై ఏండ్ల గాయాలు, వేదనలను తెలంగాణ కన్నీళ్లను తీర్చిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ .
-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ నవంబర్ 28 త్రినేత్రం న్యూస్. ఈ నెల 29న నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలి బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పిలుపు నిచ్చారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…..దీక్షా దివస్ సందర్భంగా కెసిఆర్ చేసిన ఉద్యమ పోరాటం, గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న తెగువతో నాలుగు కోట్ల మందిని ఏకం చేసి, కాశ్మీర్ నుండి కన్యా కుమారి వరకు అన్ని రాజకీయ వ్యవస్థలను ఒప్పించి మెప్పించి కుల మతాలకు అతీతంగా ఏకం చేసిన దీక్షా దివస్ ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.కేసీఆర్ సంకల్ప బలానికి, దీక్షాదక్షతకు సాక్ష్యం దీక్షా – దివస్ అని ఆయన అన్నారు.అరవై ఏండ్ల గాయాలు, వేదనలను తెలంగాణ కన్నీళ్లను తీర్చిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని ఆయన తెలిపారు.గాలి, నీరు, నేల ఉన్నంత కాలం తెలంగాణలో కేసీఆర్ అనే మూడక్షరాలు పదిలం అని ఆయన అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


