త్రినేత్రం న్యూస్ :నవంబర్ 17:నెల్లూరు జిల్లా :కావలి నియోజకవర్గం: టిడిపి కార్యాలయంలో సందడి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు పట్టణంలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కావలి టిడిపి కార్యాలయంలో పేదలతో కలిసి చేసిన ప్రత్యేక కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పద్మావతి శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పేదలతో కలిసి ఎమ్మెల్యేతో కేక్ కటింగ్ …పేదలతో కలిసి పుట్టినరోజు జరపాలన్న పద్మావతి శ్రీదేవి భావన మేరకు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టటం మరింత ఆప్యాయంగా మార్చింది.కేక్ కట్టింగ్ సమయంలో మహిళల నినాదాలు, చప్పట్లు టిడిపి కార్యాలయాన్ని పండుగ వాతావరణంగా మార్చాయి.
ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా పద్మావతి శ్రీదేవి ఏర్పాటు చేసిన గొడుగులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా స్వయంగా పేద మహిళలకు గొడుగులు పంపిణీ చేశారు.వర్షాకాలం–ఎండాకాలంలో ఉపయోగపడే ఈ గొడుగులు అందుకోవడం మహిళల ముఖాల్లో ఆనందాన్ని నింపింది. “ప్రజలకు ఉపయోగపడే బహుమతులు ఇవ్వడమే నాకు నిజమైన సంతోషం” అని ఎమ్మెల్యే తెలిపారు.
పట్టు వస్త్రాలతో ఎమ్మెల్యేకు ఘన సత్కారం…
ఈ సందర్భంగా మహిళా నాయకురాలు పద్మావతి శ్రీదేవి గారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి పట్టు వస్త్రాలు అర్పించి ప్రత్యేక సత్కారం చేశారు.ఎమ్మెల్యే గారి నాయకత్వం, మహిళల పట్ల చూపుతున్న శ్రద్ధ, సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఉన్న నిబద్ధతను పద్మావతి శ్రీదేవి ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ,ఆవుల సురేష్, మరియు అశోక్ నాయుడు, ఎమ్మెల్యే దగు మాటి కావ్య కృష్ణారెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరిచారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


