దేవరకొండ ఆగస్టు 01 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో ఎమ్మెల్యే నివాసం (వ్యవసాయ మార్కెట్ యార్డులో) విద్యుత్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెళ్లే మాట్లాడుతూ ప్రజల అవసరాలను ముందే ఊహించి భవిష్యత్తు అభివృద్ధికి బలమైన అడుగులు వేస్తున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. గ్రామాల్లో నెలకొని ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. వ్యవసాయ బోరుబావులకు విద్యుత్ స్తంభాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించేందుకు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామస్థాయిలో విద్యుత్ అధికారులు రైతులతో కలిసి సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కార మార్గం చేపట్టాలన్నారు. విద్యుత్ ఓవర్ లోడ్ సమస్యను పరిష్కరించి రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు కృషి చేయాలని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎస్ ఈ వెంకటేశ్వర్,డీ ఈ విద్యాసాగర్, ఏ డీ సైదులు, సాగర్ రెడ్డి, శంకరయ్య, ఏ ఈ లు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


