WhatsApp Image 2025 01 27 at 19.56.09
సబ్బెళ్ళ బాపాయమ్మ వార్డు మెంబర్ గా సాధించిన విజయమే కృష్ణారెడ్డిని ఒక రాజకీయ శక్తిగా నిలిపింది
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం త్రినేత్రం న్యూస్
సబ్బెళ్ళ బాపాయమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు, పలువురు నాయకులు
రామవరం; సోమవారం అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి మాతృమూర్తి సబ్బెళ్ళ బాపాయమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు వై ఎస్ ఆర్ సి పి నాయకులు, ఎన్ డి ఏ నాయకులు పాల్గొన్నారు. అనంతరం బాపాయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అందరికీ తలలో నాలుకలా ఉండే బాపాయమ్మ ఆనాడు రామవరం గ్రామంలో టిడిపి అధిపత్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన రామవరం గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యురాలని ఈమె సాధించిన విజయాన్ని బాటగా చేసుకుని తన కుమారుడు రామవరం గ్రామంలో సబ్బెళ్ళ కృష్ణారెడ్డి ఒక రాజకీయ శక్తిగా ఎదిగారని అన్నారు.
పెదపూడి మండలం వై ఎస్ ఆర్ సి పి కన్వీనర్ గుత్తుల వెంకటరమణ, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి నాయకులు కేతా శ్రీనివాస్, అనపర్తి జడ్పిటిసి సత్తి గీతా వరలక్ష్మీ వెంకటరెడ్డి, పొలమూరు ఉప సర్పంచ్ సత్తి సూరారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్తలు సత్తి రామకృష్ణారెడ్డి, కోనాల సూర్యనారాయణ రెడ్డి, వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి సుబ్బిరెడ్డి, వై ఎస్ ఆర్ సి పి నాయకులు గువ్వల సత్తిరెడ్డి, కర్రి మంగిరెడ్డి, అనపర్తి మండలం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నల్లమిల్లి వెంకటరెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గొలుగూరి గోవిందరెడ్డి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు , పాత్రికేయులు , ఎంపీటీసీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
