MLA Distributes : నూతన ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

దేవరకొండ జులై 30 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆహార భద్రత కార్డు సంబంధిత అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేవత్ బాలు నాయక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా అన్నారు.
26 లక్షల మంది పేర్లను కొత్తగా రేషన్ కార్డులలో నమోదు చేయడంతో పాటు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణలో మాత్రమే అందించడం జరుగుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు మండల ముఖ్య పార్టీ నాయకులు మాజీ సర్పంచ్లు ,మాజీ జెడ్పిటిసి లు ,మాజీ ఎంపీటీసీ లు, యువజన కాంగ్రెస్ నాయకులు మహిళలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA distributes new food

You cannot copy content of this page

Scroll to Top