దేవరకొండ జులై 17 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని పడమటిపల్లి గ్రామానికి చెందిన పల్లె నర్సింహా ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులుగా నియమించిన ప్రముఖ ప్రజాకళాకారుడు ,రచయిత పల్లె నర్సింహ ను నేడు దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నీరు పేద కుటుంబానికి చెందిన పల్లె నర్సింహా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఊరూరున జరిగే సమావేశాలు భహిరంగ సభలలో ,రాష్ట్ర స్థాయిలో పల్లె నర్సింహా పాట ఒక ప్రత్యేకత మరియు కళారంగం సమస్యల పరిష్కారం కోసం , సమాజ మార్పుకోసం నిరంతరం పాటలు పాడుతూ ప్రజలను చైతన్యం చేస్తున్న ప్రజా కళాకారుడు ,తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా ను ప్రభుత్వం గుర్తించడం మంచి పరిణామం అని,కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


