
శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ .
MLA Balu Naik : దేవరకొండ డివిజన్ ఆగష్టు 05, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం గొల్లపల్లి గ్రామంలో VB-GRAMG నిధుల ద్వారా రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు కూడా శంకుస్థాపన చేసి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో నేరుగా ఎమ్మెల్యే మాట్లాడారు .. గ్రామంలో ఉన్న రోడ్లు, తాగునీటి సమస్యలు, డ్రైనేజీతో పాటు ఇతర స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలపై వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు లోకసాని శ్రీధర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ గండు రవి, ఉపసర్పంచ్ దొంతినేని జానకిరామారావు, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు కొర్ర రాంసింగ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, తాటికోల్ సర్పంచ్ చల్లమల విజయ్ మరియు పరిసర గ్రామాల సర్పంచులు, జూలూరు గిరి, కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గౌని సత్యనారాయణ, సీనియర్ నాయకుడు దొంతినేని వెంకటరమణ, సీనియర్ నాయకుడు YS కర్ణాకర్, మాజీ ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe