సెప్టెంబర్ 15, 2026
TRINETHRAM NEWS
Sekhar Reddy

ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి… తీదేడు గ్రామ సర్పంచ్

Sekhar Reddy : చింత పల్లి ఆగష్టు 05,త్రినేత్రం న్యూస్. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం కావాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో సర్పంచ్ వులుపాల స్వప్న శేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. గ్రామ అభివృద్ది కార్యక్రమాల్లో మహిళలు భాగస్వామ్యం కావాలని అన్నారు .

మహిళా సంఘాలబలోపేతం,స్వయం ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వినియోగం, మహిళల ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించారు.మహిళా సంఘాలు గ్రామాభివృద్ధిలో కీలక పాత్రపోషిస్తున్నాయని అన్నారు.ప్రభుత్వం అందిస్తున్నరుణాలు,ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలనిఆమెసూచించారు.

గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని, మహిళా సంఘాల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో మాజీ ఉప సర్పంచ్లు ధరణిపతి రమణారావు,ఉలుపాల శేఖర్ రెడ్డి,గ్రామ వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, రెడ్డి పద్మ పరమేష్,మర్ల యాదగిరి,శివర్ల పర్వతాలు యాదవ్,మహిళా సంఘాల సి.సి రమేష్,గ్రామ కార్యదర్శి కిరణ్ కుమార్,పెద్దలు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page