డిండి(గుండ్ల పల్లి) మే13 త్రినేత్రం న్యూస్. రైతులు పండించిన ప్రతీ గింజను కొంటాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలి – కలెక్టర్ ఇలా త్రిపాఠీ .. కొనుగోలు కేంద్రాలు మోసాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. ధాన్యం తరుగు పేరుతో కోతలు లేకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలి. రైతులు వ్యయ భారం తగ్గించేందుకే ప్రజా ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు.- ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
డిండి మండలంలోని చెరుకు పల్లి, కామేపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుకోలు కేంద్రాలను నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సంబంధిత అధికారులను రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ:- కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలను పంట రుణమాఫీ కోసం ఖర్చు చేసి సంపూర్ణంగా రుణమాఫీ చేశామని అన్నారు.
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవ్వరు దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుందని,కొనుగోలు కేంద్రాలలో రైతులు వారి పంటలను అమ్మి సరైన గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.
ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు మోసాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సన్నరకం వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు.
ధరణి ఉన్నప్పుడు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది… కానీ భూభారతితో అధికారులే రైతుల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించబోతున్నారు.. రైతులు పొలంలో కష్టపడి పంటలు పండిస్తేనే కోటీశ్వరుడికి అయినా పేదవాడికి అయినా అన్నం పెట్టేది రైతే అని అన్నారు.
కష్టపడి పంట పండించిన రైతుకు వ్యవసాయ మార్కెట్ లో ఎలాంటి కష్టం లేకుండా ధాన్యాన్ని అమ్ముకుని ఆనందంగా ఇంటికి వెళ్ళే విదంగా ప్రజా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తున్నాం అని అన్నారు. ఇది రైతు ప్రభుత్వం, రైతుల మేలుకోరే ప్రభుత్వం. ధాన్యం కొనుగోలు లో నల్గొండ జిల్లా అగ్రగామిగా నిలుస్తుంది. అనంతరం RDO కార్యాలయంలో మిల్లర్లతో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,PACs చైర్మన్లు,సంబంధిత అధికారులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు,యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


