
ముస్లిం, మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అమిలినేని
అల్లా అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా ఎదగాలి
MLA Amilineni : త్రినేత్రం న్యూస్ : ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా ఎరగాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అందుకు మనం కూడా అండగా నిలవాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు..పవిత్ర రంజాన్ సందర్బంగా ముస్లిం సోదరులు పవిత్రంగా బావించే ఈద్గా మైదానంలో ముస్లిం మైనార్టీ సోదరులతో కలసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ ఇప్పటికి మూడు రంజాన్ పండుగలను మీమధ్య జరుపుకోవడం నా అదృష్టంగా బావిస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా ఎదగడానికి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని, అందరూ సంతోషంగా ఉండాలని కోరారు..కళ్యాణదుర్గం పట్టణంలోని మారెంపల్లి కాలనీలోని మాధర్సా అసంపూర్తిగా ఆగిందని నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని ముస్లిం సోదరులు కోరారని తప్పకుండా త్వరలో పూర్తి అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు..ముస్లిం సోదరులు ఎమ్మెల్యే అమిలినేని ని ఘనంగా సన్మానించారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

