జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Minister visits Victim

Minister visits Victim : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 31; నూజివీడు నియోజకవర్గం, ఆగిరిపల్లి మండలం, శోభనాపురం గ్రామంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో గాయపడిన నక్కనబోయిన సాంబశివరావును రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార మరియు పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు.

ఘటనలో గాయపడిన సాంబశివరావుకు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించగా, మంత్రి ఆ వైద్యశాలకు వెళ్లి ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి అత్యుత్తమ వైద్యం అందించి త్వరితగతిన కోలుకునేలా చర్యలు తీసుకోవాలని వాళ్లకు సూచించారు.

దాడి ఘటనకు దారితీసిన పరిస్థితులను సాంబశివరావును అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించే వాళ్లు ఎంతటి వారైనా చట్టం ముందు సమానమేనని, ఘటనకు బాధ్యులైన వాళ్లపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

ప్రజల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page