Minister Durgesh : చిరుకూరి కుటుంబానికి మంత్రి దుర్గేష్ పరామర్శ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్… కడియం గ్రామంలో ఇటీవల మృతి చెందిన శతాధిక వృద్ధురాలు చిలుకూరి బాపయమ్మ కుటుంబాన్ని పలువురు పమర్శిస్తున్నారు.
ఈనేపద్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు.
బాపయమ్మ కుమారుడు సీనియర్ జనసేన నాయకులు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు ఆయన సోదరులకు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. దివంగత బాపయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
పరామర్శించిన వారిలో కడియపులంక సొసైటీ అధ్యక్షులు గట్టి నరసయ్య, మండల టిడిపి అధ్యక్షులు వెలుగు బంటి నాని, మాజీ సర్పంచ్ పుల్లా రామారావు, ప్రముఖ న్యాయవాది తోరాటి వసంతరావు,జనసేన పార్టీ నాయకులు ఎంపీటీసీ నాగిరెడ్డి సూర్య రామకృష్ణ, మార్గాన్ని ఏడుకొండలు, వట్టికూటి ప్రసాద్, తమ్మిశెట్టి ప్రసాద్, కొప్పిశెట్టి శ్రీను, మర్రిశంకర్,చల్లఅంజి,పార్టీలకతీతంగా పలువురు నాయకులు, రైతులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister Durgesh visits Chirukuri family

You cannot copy content of this page

Scroll to Top