Mega Job Fair : మండపేటలో మెగా జాబ్ మేళా

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ వారి ఆధ్వర్యములో మండపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు మంచి ఉద్యోగం సాధించడానికి ఈ జాబ్ మేళా ఉపయోగపడుతుందని, మీ నైపుణ్యం తో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో 11 కంపెనీలు పాల్గొనగా 206 మంది హాజరయ్యారు. వీరిలో 94 మంది ఉద్యోగాలకు సెలెక్ట్ కావడం జరిగిందని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి హరిశేషు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పసలపూడి శ్రీనివాసరావు, రాయుడు గంగరాజు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా॥టి.కె.వి.శ్రీనివాసరావు, ఎ.పి.ఎస్.ఎస్.డి.సి స్టాఫ్, సీడప్ స్టాఫ్ మరియు కళాశాల స్టాఫ్ పాల్గొన్నరు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mega Job Fair in

You cannot copy content of this page

Scroll to Top