MLA Vegulla : ఎలక్ట్రికల్ అధికారులతో ఎమ్మెల్యే వేగుళ్ళ సమావేశం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, కపిలేశ్వరపురం మండలం, వెదురుమూడి, నల్లూరు, నిడసనమెట్ట, వల్లూరు, నేలటూరు గ్రామాలలో కరెంటు సమస్యలపై శాశ్వత పరిష్కారం నిమిత్తం డా॥బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎలక్ట్రికల్ ఎస్.ఇ రాజబాబు, ఇ.ఇ. కె.రత్నాలరావు, రామచంద్రపురం డి.ఇ.ఇ మురళీ, మండపేట డి.ఇ.ఇ తిరుమలరావు లతో మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ర్్ అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ కపిలేశ్వరపురం మండలంలో కరెంటు సమస్యలకు శాశ్వత పరిష్కారం తెలపాలని ఎలక్ట్రికల్ అధికారులను అడుగగా వారు టేకి సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తే తప్ప శాశ్వత పరిష్కారం కాదని ఎమ్మెల్యే కు తెలియజేశారు.

దీనిపై ఎమ్మెల్యే వేగుళ్ళ వెంటనే స్పందించి విద్యుత్ శాఖా మాత్యులు గొట్టిపాటి రవికుమార్,తో ఫోన్లో మాట్లాడి టేకి గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి అనుమతులు ఇప్పించమని కోరగా మంత్రి, సానుకూలంగా స్పందిచారని ఎమ్మెల్యే తెలిపారు. కరెంటు సమస్యలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా రామచంద్రపురం డి.ఇ.ఇ గార్ని వారంలో రెండు రోజులు కపిలేశ్వరపురం మండలం లో పర్యటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి పుత్సల శ్రీను, ఏడిద సీతానగరం మాజీ ఎంపిటిసి పెనుమత్స వెంకట వర్మరాజు, తదితర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Meeting of MLA Vegulla

You cannot copy content of this page

Scroll to Top