MLA Arikepudi Gandhi : పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించాలి

TRINETHRAM NEWS

వివేకానంద నగర్ లో రాఘవి హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

కూకట్పల్లి జనవరి 26 (త్రినేత్రం న్యూస్) : ప్రైవేటు ఆసుపత్రులు పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఈనాడు కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన రాఘవే ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీష్ గౌడ్ తో కలిసి ఆరికెపూడి గాంధీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివసించే ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు ముందుండాలని సూచించారు. ఆస్పత్రి నిర్వాకులు డాక్టర్ అరుణీందర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నపిల్లల నుండి మొదలుకొని వృద్ధుల వరకు అన్ని రకాల చికిత్సలు జరిగే విధంగా అదునాతన సౌకర్యాలతో ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.

ఆస్పత్రిలో 40 పడకల గదులతో ప్రత్యేకంగా ఎన్ ఐ సి యు, ఐసీయూ సౌకర్యాలతో రూపొందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబాల మహేష్ గౌడ్, బాష్పాక యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Medical services should be provided in a way that is accessible

You cannot copy content of this page

Scroll to Top