Collector AS Dinesh Kumar : చదరంగంలో జిల్లా స్థాయి ప్రతిభకు పతకాలు

TRINETHRAM NEWS

రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి: జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

అల్లూరిజిల్లా ఫిబ్రవరి 18, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లాలో జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పతకాలు అందజేశారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించబడ్డాయి. సుమారు వందమంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్‌లో పతకాలు ప్రదానం చేశారు.
ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో తిరుపతిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి షాప్ లీగ్ చదరంగం పోటీలకు అర్హత సాధించారు.
విజేతల వివరాలు:
అండర్–13 బాలురు:
ప్రసన్నకుమార్ (రింతాడ) – ఫస్ట్
డి. గుణశేఖర్ (మోదమాంబ స్కూల్, పాడేరు) – సెకండ్
అండర్–13 బాలికలు:
జే. జోత్స్న (హుకుంపేట) – ఫస్ట్
కె. లక్ష్మిత్ రోహిణి (పాడేరు) – సెకండ్
అండర్–15 బాలురు:
జి. ఇంద్రసాగర్ (గెమ్మలి) – ఫస్ట్
టీ. ఉదయ్ కిరణ్ (లోచలపుట్టు) – సెకండ్
అండర్–15 బాలికలు:
యు. మహీ ప్రియ (హుకుంపేట) – ఫస్ట్
భవ్య శ్రీ లక్ష్మి (కిలగాడ) – సెకండ్
అండర్–17 బాలురు:
వి. సదాశివ (పాడేరు) – ఫస్ట్
వి. ధనుష్ (లోచలపుట్టు) – సెకండ్
అండర్–17 బాలికలు:
బి. దయామణి (పాడేరు) – ఫస్ట్
బి. మల్లేశ్వరి (పాడేరు) – సెకండ్
అండర్–19 బాలురు:
కె. కేత్విన్ హర్ష (స్పోర్ట్స్ స్కూల్, అరకు) – ఫస్ట్
జి. బాలాజీ (పాడేరు) – సెకండ్
అండర్–19 బాలికలు:
కె. చైత్ర (హుకుంపేట) – ఫస్ట్
బి. లక్ష్మి అన్నపూర్ణ (పెదగరువు) – సెకండ్
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ. జగన్మోహన్ రావు, జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ పి. సూరిబాబు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Medals for district level talent in chess

You cannot copy content of this page

Scroll to Top