జూలై 16, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 125 – గాజుల రామారం డివిజన్ షిరిడి హిల్స్ లో వారాహి అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ హర్షిత్ మహారాజ్ గురూజీ పర్యవేక్షణలో నిర్వహించిన శ్రీ వారాహి అమ్మవారి ఆషాడ గుప్త నవరాత్రుల వేడుకలకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. మహిమాన్విత అమ్మవారైన వారాహి అమ్మవారి కృపా కటాక్షలతో ప్రజలంతా సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో షిర్డీ హిల్స్ కాలనీ ప్రెసిడెంట్ రమేష్, ప్రధాన కార్యదర్శి సత్య, కోశాధికారి బాల కిషన్, కాలనీ వాసులు ప్రభాకర్ రావు, యశస్వి, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, ఇబ్రహీం ఖాన్, మూసా ఖాన్, తెలంగాణ సాయి, సుంకరి చందు, చిన్నా చౌదరి, కరుణాకర్ రాజు, ప్రసాద్, మహేష్, శివా నాయక్, జునైద్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

May the grace of

You cannot copy content of this page