తేదీ : 01/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరంలో సిపిఐ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిది వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రపంచ కార్మికులారా ఐక్యం కాండి అంటూ నినాదాలు చేస్తూ ప్రకాశం చౌక్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భముగా నాయకులు, కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం గురించి వివరించడం జరిగింది. కార్యక్రమంలో సిపిఐ నేతలు, కార్మికులు యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


