తేదీ : 18/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, పట్టణ అభివృద్ధికి సంబంధించి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం ఆమోదించిందని డైనమిక్ శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్ అన్నారు. ఈ మేరకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు చెందిన రీజనల్ దర్శకులు శాసనసభ్యులు కు మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచిన అంశాలను, వివరించారు. అవుటర్ రింగ్ రోడ్ ఏర్పాటు, కమర్షియల్ , ఇండస్ట్రియల్ , రెసిడెన్షియల్ జోన్ ల తో డిటిపిసి అప్రూవల్ పొంది ఉన్న లేఅవుట్లు, ల్యాండ్ కన్వర్షన్, ముఖ్య దేవాలయాలు, కాలువలు, విద్యాసంస్థలు పొంది పరిచినట్లు పేర్కొన్నారు. పట్టణానికి చెందిన ముఖ్య నాయకులతో పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె. నారాయణ తో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పరిణామంతో రోషన్ కుమార్ కు, కూటమి ప్రభుత్వానికి నాయకులు, ప్రజలు హర్షతి రేఖలు వ్యక్తం చేశారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


